రాళ్లపాడు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ ఆదాల


- ఎమ్మెల్యే మహీధర్రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

- నియోజక అభివృద్ధికి పై త్వరలో సీఎంను కలుస్తామన్నఎంపీ ఆదాల

- ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సంక్షేమఫలాలు అమలు చేస్తున్న సీఎం జగనన్న



 ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ మేరకు ఆయన కందుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కరోనా  మహమ్మారి నేపద్యంలో 8 నెలలుగా నియోజవర్గంకి దూరంగా ఉన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి రాగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  కలసి పలుఅభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు శనివారం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు మండలం రెండు సచివాలయ భవనాలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి  లాంఛనంగా  ప్రారంభించారు. అనంతరం హైవేలోని  గుడ్ న్యూస్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లింగసముద్రం మండలం లోని తిమ్మారెడ్డి పాలెం గ్రామంలో గ్రామ సచివాలయ కార్యదర్శి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తో కలిసి రాళ్లపాడు రిజర్వాయర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితులను రైతులనడిగి తెలుసుకోవడం జరిగింది. తరువాత లింగసముద్రం మండలంలో తిమ్మారెడ్డి పాలెం నూతన ఆలయ భవనం, సిమెంటు రోడ్డులను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా రాళ్లపాడు రిజర్వాయర్ సదస్సుకు సందర్శించి అక్కడ పరిస్థితులను రైతులతో మాట్లాడటం జరిగింది.  లింగసముద్రం మండలం నూతన సచివాలయ భవనాన్ని ఎంపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రైతులతో  ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సున్నావడ్డీ రుణాలచెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు  మానుగుంట మహీధర్రెడ్డి రెడ్డి  నెల్లూరు విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు  సుధాకర్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య,  కోటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్  నరసింహారావు, కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.