ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తా.... ఇన్ చార్జ్ జిల్లా పరిషత్ సీఈవో ప్రభాకర్ రెడ్డి.... 
                               రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను గ్రామీణ స్థాయికి తీసుకు పోవాలని ప్రయత్నిస్తున్నారో అని వీటిని త్వరితగతిన ప్రజలకు చేర్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని మరింత పటిష్టం చేసే విధంగా పని చేస్తామని జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రెడ్డి జడ్పీ సీఈఓ ఛాంబర్లో గల కాణిపాక వరసిద్ధి వినాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం తో ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన సబార్డినేట్ లు ఎంపీడీవోలు ఇతర జిల్లాపరిషత్ సిబ్బంది స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల ఈ మేరకు పని చేయడం జరుగుతుందని గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేశారని వాటన్నిటినీ అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని అదేవిధంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా జిల్లాలో లో మంచి ఫలితాలు తీసుకురావడం జరుగుతుందని గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరు కోసం ప్రయత్నిస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు