ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పనబాక కోటేశ్వరరావు డిమాండ్
January 07, 2021
ap
,
bjp
,
gudur
,
Nellore
,
private schools
సుప్రీంకోర్టు ఆదేశాలు* ధిక్కరించి
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు అన్నారు వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు, బుధవారం పనబాక కోటేశ్వరరావు, బిజెపి నాయకుల తో కోట ఏం ఈ ఓ కార్యాలయంలో ఎం ఈ ఓ మణికల వెంకట సునీల్ కుమార్ ని ప్రవేట్ పాఠశాలలు పై చర్యలు తీసుకోవాలని అని ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కోట మండలం లో ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గత సంవత్సరమునకు చెందిన స్కూల్ ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు, ఫీజులు వసూళ్ళు చేస్తున్న స్కూలు ల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిజెపి తరుపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు, విద్యార్థుల పట్ల కొన్ని ప్రైవేటు స్కూలు విద్యా బోధన పై శ్రద్ధ వహించక ఫీజులు వసూళ్ల పై మాత్రమె శ్రద్ధ చూపుతున్నారని ఫీజులు చెల్లించకుంటే పరీక్షలకు వెళ్లారని విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని అని ఆయన తెలిపారు, విద్యార్థుల ను వేధిస్తున్న స్కూల్లో పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈయన వెంట బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు