ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ యోజన పథకంపై కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి
August 18, 2020
collector
,
confrence
,
JOINT COLLECTOR
,
nelllore
,
prime minister yojana padhakam
,
zp deoc
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాగణంలోని డి.ఈ.ఓ.సి నందు మంగళవారం ఉదయంతో
కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ యోజన పథకంపై అటవీ శాఖ అధికారులు, ఐ.టి.డి.ఏ. అధికారుల, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలుచేసి.., గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద నెల్లూరు జిల్లాలోని రాపూరులో ఇప్పటికే " వన్ ధన్ వికాస్ " కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.., దీనిలో 15 గ్రూపులలో 275 మంది గిరిజనులు ఉన్నారని ఐ.టి.డి.ఏ అధికారులు తెలిపారు. అడవి నుంచి అటవీ ఫలసాయం సేకరించి, ముడి ఉత్పత్తులను తక్కువ ధరకే గిరిజనులు అమ్ముకుని నష్టపోతున్నారని.., దీనికి అడ్డుకట్టవేసి, వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా వారికి మెరుగైన శిక్షణ ఇచ్చి, ఆర్గానిక్ ఉత్పత్తులు తయారేచేసేలా ప్రోత్సహించి, వాటి మార్కెటింగ్ బాధ్యతను కూడా అధికారులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వన్ ధన్ వికాస్ కేంద్రంలోని 15 గ్రూపులకు ఒక్కో గ్రూపుకి లక్ష రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు మంజూరు అవుతాయని, వాటి ద్వారా వారికి శిక్షణ ఇవ్వడానికి, వారికి అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఈ నిధులు వినియోగిస్తామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. దీనికి స్పందించిన కలెక్టర్ గిరిజనులకు ఈ పథకం ద్వారా ఏడాది మొత్తం పని ఉండేలా, వారికి మెరుగైన ఆదాయం వచ్చేలా ఆర్గానిక్ పద్దతిలో పంటలు సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వెదురు, ఆమ్లా, మారేడు గడ్డలు, కలివి కాయలు సాగుకి జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఈ పంటల సాగు చేసేలా గిరిజనులను ప్రోత్సహించాలన్నారు.
ఈ సమీక్షా, సమావేశంలో ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీ శీనా నాయక్, డి.ఎఫ్.ఓ శ్రీ షణ్ముఖ కుమార్, ఐ.టి.డి.ఏ పి.ఓ సి.ఆనంద మనికుమార్, వ్యవసాయ శాఖ జె.డి, అధికారులు పాల్గొన్నారు.