ప్రధాన్ మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) అమలు చేయబడుతుంది.
June 16, 2021
ap
,
ceo
,
Nellore
,
prime minister
,
schemes
,
zp
షెడ్యూల్డ్ కులాల మెజారిటీ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై) పథకం 2018-19 నుండి అమలు జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి, ఈ పథకం ప్రధాన్ మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) లో ఒక భాగంగా అమలు చేయబడుతుంది. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ ఎస్సీ మెజారిటీ గ్రామాలకు, సమర్థ అధికారం మరియు ప్రయోజనాలను విస్తరించే ఉద్దేశంతో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం 2021-22 క్రింద దేశంలో 6055 గ్రామాలు దీని పరిధిని విస్తరించింది. అందులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 54 అర్హత గల గ్రామాలను ఎంపిక చేయగా, అందులో 16 గ్రామాలు శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో ఈ పథకము అమలు కోసం అంగీకారం కొరియున్నారు. ఈ పథకము క్రింద ప్రతి గ్రామానికి 20.00 లక్ష్యల చొప్పున గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయి.