మరింత దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
August 25, 2020
ap
,
gold
,
Nellore
,
prices reduced
,
silver
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దిగొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.557 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.52,350కి చేరింది. ఇక వెండి ధర కూడా మంగళవారం భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ.1606 తగ్గడంతో.. గత ట్రేడ్‌లో రూ.68,342 వద్ద ముగిసిన వెండి ధర ఇవాళ్టి ట్రేడ్‌లో రూ.66,736 వద్ద ముగిసింది.
ఇక గత ట్రేడ్‌లో రూ.52,907 వద్ద ముగిసిన తులం బంగారం ధర కూడా రూ.557 తగ్గడంతో ఇవాళ్టి ట్రేడ్‌లో రూ.52,907 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటమే ఈ రోజు బంగారం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం నాటి ట్రేడ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ముగిసిందని చెప్పారు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూలతలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కలిసి వస్తున్నాయన్నారు.