కరోనాపై అవగాహన అవసరమని ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పాలకొల్లు నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న మోటార్ సైకిల్ ర్యాలీ నెల్లూరు వచ్చిన సందర్బంగా  ఆయన స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న వారు ముందుగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేశారు.  ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరూ ముందు జాగ్రత్తగా కరోనాను నిరోధించాలని అన్నారు. ర్యాలీ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్  కె. వి. ఎస్. ఎల్. ఎన్ రాజు    మాట్లాడుతూ వివేకానంద ర్యాక్ మెమోరియల్ నిర్మించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా  వివేకానంద యాత్ర పేరున కరోనాపై అవగాహన కల్పించేందుకు ఈ నెల పదో తేదీ నుంచి పందొమ్మిది వ తేదీ వరకు పాలకొల్లు నుంచి కన్యాకుమారి వరకు యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు . భారతీయ సంస్కృతి ప్రకారం  నడుచుకుంటే కరోనాను నిరోధించవచ్చన్నారు . శాస్త్రీయ పద్ధతుల్లో  మూలికలు గ్రామీణ మందులు వాడితే కరోనా రాదు అని   అన్నారు .ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారికి నేతాజీ సుబ్బారెడ్డి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ ఘనంగా సన్మానించారు