ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవాభావం  కలిగిన వ్యక్తి అయిన లెమన్ మర్చంట్ మోహన్ రెడ్డి గారి సహాయ  సహకారాలతో ఈరోజు 25.05.2020 గూడూరు లోని అశోక్ నగర్ లోని 5,8 వార్డ్ లోని  సచివాలయం నందు సచివాలయం సిబ్బందికి, వాలంటీర్స్ కు, పారిశుధ్య కార్మికుల కు,ఆశ వర్కర్స్ కు మొత్తం 30 కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలను ముఖ్య అతిథిగా గా వచ్చిన మన గూడూరు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. అధ్యక్షుడు  కడివేటి.చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,బాలయ్య నాయుడు,రవి కుమార్,ఎం మస్థానయ్య , గ్రానైట్ ప్రభాకర్,వాచ్ షాప్ రాము,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.