కరోణ మహమ్మారి తో పోరాడి  సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తమ విధులకు హాజరవుతున్న మహిళ హోం గార్డ్ నాగూరమ్మకు  మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఘన స్వాగతం లభించింది.  సూళ్లూరుపేట ఎస్ ఐ కాసుల శ్రీనివాసరావు  పోలీస్ సిబ్బంది తమ సహా ఉద్యోగి రాలు నాగూరమ్మకు గౌరవ  మర్యాదలతో  పూలమాలలు వేసి  చప్పట్లతో హర్షధ్వానాల మధ్య స్టేషన్లోకి  స్వాగతం పలికారు.