ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించిన కాకాణి"సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించిన కాకాణి"
తేది:04-09-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ఆసుపత్రి అభివృద్ధి కోసం, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే వారికి వసతి, సదుపాయాల కల్పన కోసం కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బందితో చర్చించి, అనేక నిర్ణయాలు తీసుకున్నాం.
👉 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా కోవిడ్ సమయంలో విశేష సేవలందించి అనేక మంది ప్రాణాలు కాపాడగలిగాం.
👉 కోవిడ్ సమయంలో సమర్థవంతంగా పని చేసిన వైద్యులు, సిబ్బంది, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు అన్ని వసతి సదుపాయాలు కల్పించడంతోపాటు,విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
👉 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన "కాయకల్ప" అవార్డు చేజిక్కించుకోవడం సంతోషం.
👉 నియోజకవర్గంలోని మరొక ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపును పొందడం అభినందనీయం.
👉 కోవిడ్ మూడో విడత సంకేతాలు వెలువడుతున్న దృష్ట్యా ఆస్పత్రిలో అవసరమైన ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాం.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని నియమించి, కరోనా సోకిన వారికి సేవలు అందించేందుకు వెసలుబాటు కల్పించారు.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత, రెండో విడత సమయంలో వరుసగా సమీక్షలు నిర్వహించి, కరోనా వ్యాధి నయం చేయడానికి అవసరమైన మందులను ఆస్పత్రులకు చేర్పించారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల ద్వారా అధికార పార్టీ శాసన సభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చికిత్స కోసం వస్తున్నవారికి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేయడం సంతోషం.
👉 ప్రభుత్వం కల్పిస్తున్న వనరులతో పాటు, ఆసుపత్రి అభివృద్ధి నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వెచ్చించి, చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి సమగ్రమైన, సంపూర్ణమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.