*పిడుగుపడి బాలుడు మృతి*

తిరుపతి జిల్లా. దొరవారిసత్రం:-

 మండలంలోని పాలెంపాడు గ్రామం లో నివాసముంటున్న గంధం. గురవయ్య కుమారుడు గంధం శంకరయ్య వయసు (15) సంవత్సరాలు గల బాలుడు తమ తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగాలేక గ్రామం లోని బర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో తమ తల్లి దండ్రులకు చేదోడు, వాదోడుగా  ఉండాలని చిన్న వయసు అవినా పెద్ద మనసుతో అలోచించి తను చదుకోవాలని ఉన్న కుటుంబ ఆర్ధిక పరిస్థితిలు బాగా లేకపోవడంతో  చదువును మధ్యలోనే ఆపేసి తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ తను చేయలగలిగిన పనులన్నీ చేస్తూ కుటుంబం నడిపించుకుంటున్న తరుణంలో బాలుడి తల్లిదండ్రులు ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా బర్రెలను తీసుకొని వెళ్లి పంట పొలాలలో మేపుతుండగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన శంకరయ్య ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వర్షం పడుతున్న సమయంలో తల్లిదండ్రులకి కొంచెం దూరంలో కూర్చొని ఉన్న శంకరయ్య పై పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉండగా ఒక్కగాన ఒక్క కొడుకు పిడుగు పాటికి గురై మృతి చెందడంతో ఆ కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి.