సూర్యగ్రహణం సందర్భంగా పెంచలకోన ఆలయాం మూసివేత
June 20, 2020
ap
,
close
,
karona
,
Nellore
,
penchalkona temple
,
rapur
సూర్యగ్రహణం సందర్భంగా పెంచలకోన ఆలయాం మూసివేత
పెంచలకోన పుణ్యక్షేత్రం
రేపు సూర్యగ్రహణం సందర్భంగా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన ఆలయాన్నీ ఈరోజు రాత్రి శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి,ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి,ఆంజనేయ స్వామి వార్లకు నివేదన ఏకాంతంగా సేవ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆలయాలకు బీగముద్ర వేశారు.రేపు ఉదయం 10:18 నుంచి ప్రారంభమైన మధ్యాహ్నం 1:54 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని, అందువల్ల ఆలయాన్ని మూసివేసి తిరిగి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సంప్రోక్షణ,ఆలయ శుద్ధి తదితరాలను పూర్తి చేసిన అనంతరం సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు.