పెంచలకోన గరుడ పంచమి వేడుకలు
July 25, 2020
ap
,
garuda
,
lakshminarsimha swamy temple
,
Nellore
,
penchalkona
,
rapur
,
seva
,
temple
కోనలో
గరుడ పంచమి వేడుకలు
పెంచలకోన పుణ్యక్షేత్రం
గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పెంచలకోనలోని శ్రీవారి ఆలయంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి అభిముఖంగా ఉన్న గరుడాళ్వార్ కి తిరుమంజనం, విశేష పూజలు నిర్వహించారు, గరుడ మాలామంత్ర వేద వాద్యములతో నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు.
శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడపంచమి'' పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి,శశి స్వామి, వర్ధన్ స్వామి, దేవస్థానం సిబ్బంది ప్రాణాత్ సారథి, నర్సింహ,వెంకటసుబ్బయ్య, తదితరులు ఉన్నారు.