సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత ...
సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత .....
బెంగళూరు: ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్లు సమాచారం.
శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడటంతో జయంతిని నిన్న (మంగళవారం) హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
35 ఏళ్లుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు.
ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
1945లో బళ్లారిలో జయంతి జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 500కిపైగా చిత్రాల్లో నటించారు.
తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
‘పెదరాయుడు’లో రజనీకాంత్‌కు చెల్లెలుగా, మోహన్‌బాబుకు అత్తయ్యగా నటించి మెప్పించారు.
1950వ దశకం నుంచి ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటిగా ప్రెసిడెంట్ మెడల్, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారు.
కన్నడ చిత్రసీమ ‘అభినయ శారద’అనే బిరుదుతో జయంతిని సత్కరించింది..