నెల్లూరు సిటీ నియోజకవర్గం లో పెద్దఎత్తున హాజరు అయిన 52 వ డివిజన్ ysrcp కార్యకర్తలు, డివిజన్ ఇన్ చార్జ్   ఎంపిక తో బాణా సంచ కాల్చి సంబరాలు చేసుకున్న పార్టీ క్యాడర్





నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో  52 వ డివిజన్ నుంచి 200 మంది వరకు ysrcp కార్యకర్తలు హాజరు అయ్యి డివిజన్ ఇన్ చార్జ్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది.

డివిజన్ ఇన్ చార్జ్ గా మహబూబ్ బాషా గారి పేరును .. ప్రకటించారు.*

ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు.. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. మహబూబ్ బాషా గారికి  అభినందనలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..

కష్టపడి పని చేసే మనస్తత్వం.. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉన్న.. మహబూబ్ బాషా గారిని  52 వ డివిజన్ ఇన్ చార్జ్ గా ఎంపిక చేశామని తెలిపారు. 

పార్టీ కార్యక్రమాలను డివిజన్ లో ప్రతి గడపగడపకు తీసుకువెళ్లి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. 

కార్యకర్తలకు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉంటూ.. పరిష్కార దిశగా.. ముందుకు సాగాలని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియజేశారు. 

డివిజన్ లో మిగిలిన నాయకులకు కూడా.. జిల్లా రాష్ట్రస్థాయి కమిటీలలో ప్రాధాన్యం కల్పిస్థామన్నారు. 

పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో పనిచేసి.. వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ.. డివిజన్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని మహబూబ్ బాషా గారు  తెలిపారు.

తనకు అన్ని విధాల సహకరించిన డివిజన్ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు సిద్ధిక్ గారు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున,  జిల్లా ప్రధాన కార్యదర్శి & కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, కార్పొరేటర్లు కరీముల్లా  గారు, జయలక్ష్మి,గారు, వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ గారు, జాహీద్ గారు, వైసిపి నాయకులు యస్దాని గారి తో పాటు.....

52 డివిజన్ సీనియర్ వైసిపి  నాయకులు రమేష్ గారు మాట్లాడుతూ డివిజన్ లోని కార్యకర్తలకు అందుబాటులో ఉండి ysrcp ని బలోపేతం చేస్తామని తెలియచేసారు. ఇంకను డివిజన్ నుంచి ysrcp నాయకులు శ్రీనివాసులు గారు, జలీల్  గారు, ముసాభాయ్ గారు, ఫయాజ్ గారు , నూరు గారు,హరున్ గారు, బివికె యాదవ్ గారు,కార్యకర్తలు పాల్గొన్నారు.