పార్లమెంటు సభ్యులకు డిల్లీలో మాగుంట ఆత్మీయ విందు   

 

   ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు మరియు ఆయన తనయులు – ప్రముఖ పారిశ్రామిక వేత్త, శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు ఈ రోజు డిల్లీలోని తన కార్యాలయంలో అన్ని పార్టీలకు చెందిన మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు 70 మందికి  ఆత్మీయ విందు ఇచ్చినారు.  ఈ విందు కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి, శ్రీమతి మీనాక్షి లేఖీ గారు,  వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, శ్రీమతి అనుప్రియా పటేల్ గారు, పార్లమెంటు సభ్యులు మరియు మాజీ న్యాయ శాఖ సహాయక మంత్రి,  శ్రీ పి.పి.చౌదరి గారు, పార్లమెంటు సభ్యులు  మరియు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, శ్రీ గిరీష్ బాలచంద్ర బాపట్ గారు,  పార్లమెంటు సభ్యులు మరియు మాజీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ ఫ్రాన్సిస్కో సర్ దిన్ హా గారు, పార్టీల ఫ్లోర్ లీడర్లు, శ్రీ పినాకి మిశ్రా గారు (BJD), శ్రీ నామా నాగేశ్వర రావు గారు (TRS), శ్రీ నితేష్ పాండే గారు (BSP),  పార్లమెంటు సభ్యులు, శ్రీ కార్తీ చిదంబరం గారు, శ్రీమతి కనిముళి కరుణానిధి గారు, మాజీ కేంద్ర మంత్రి, శ్రీ ప్రఫుల్ పటేల్ గారు, శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గారు, శ్రీ నిషికాంత్ దూబే గారు, శ్రీమతి ప్రియాంకా చతుర్వేది గారు (రాజ్య సభ సభ్యులు), మాజీ ప్రధాన మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారి కుమారులు, శ్రీ నీరజ్ శేఖర్ గారు,  శ్రీ విజయసాయిరెడ్డి గారు, శ్రీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి  గారు, శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గారు, శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, శ్రీ గళ్ళా జయదేవ్ గారు, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ కేశినేని నాని గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీమతి సుప్రియా సూలే గారు, శ్రీమతి సుమలత అంబరీష్ గారు, శ్రీమతి గొద్దేటి మాధవి గారు, శ్రీ దానే సలీ గారు, శ్రీ P.C. మోహన్ గారు, శ్రీ శివకుమార్ ఉదాశీ గారు శ్రీ సౌగత రాయ్ గారు (AITC), శ్రీ హిబి ఇడెన్ గారు (INC), శ్రీ మనిక్కం ఠాగూర్ గారు,  డా. కళానిధి వీరస్వామి గారు  మరియు తదితర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.