పనుల నాణ్యతా పరిశీలనలో కమిషనర్

నగరంలోని వివిధ ప్రాంతాల్లో 14వ ఆర్ధిక సంఘం నిధులతో జరిగిన రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణ పనులు నాణ్యతను అధికారులతో కలసి నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. వావిలేటి పాడు గృహ సముదాయాల రోడ్డు పనులు, నక్షత్ర స్కూల్ వీధి, విఆర్కే సిల్క్స్ వీధి, నక్కలగుంటలోని డ్రైను పనుల నాణ్యత ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీచేశారు.