నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం..
కేడర్ కు దిశానిర్దేశనం చేసిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు రాధాక్రిష్ణమనాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, మేదరమెట్ల కోదండరామ నాయుడు, అన్ని మండలాల నాయకులు..
పార్టీ నూతన మండల అధ్యక్షులుగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి(తోటపల్లి గూడూరు), పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి(ముత్తుకూరు), గుమ్మడి రాజాయాదవ్(వెంకటాచలం), గాలి రామక్రిష్ణారెడ్డి(మనుబోలు), తలచీరు మస్తాన్ బాబు(పొదలకూరు)ని నియమిస్తున్నట్టు ప్రకటించిన సోమిరెడ్డి..వైసీపీ నేతల అవినీతి, అరాచకం, అన్యాయాలు, దోపిడీతో ప్రజలు పూర్తిస్థాయిలో విసుగుచెందుతున్నారు..
రైతు పండించిన ధాన్యం ధర కంటే ఏట్లో దొరికే ఇసుక ధర ఎక్కువగా ఉన్న పరిస్థితి వైసీపీ పాలనలో నెలకొంది..
ఉచితంగా లభించే ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.1,600 ధర, ట్రాక్టర్ బాడుగ కన్నా వైసీపీ నేతలు తమకు ఓట్లేసిన ప్రజలపై అదనంగా విధిస్తున్న మూడింతల సుంకమే భారంగా మారింది...
ఒక్క విరువూరు ఇసుక రీచ్ నుంచే పెద్దరెడ్డి సొంత ఖజానాకు నెలకు రూ.40 లక్షలు జమవుతున్నాయి..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతలతో కలిచి ఇసుక రీచ్ అక్రమాల్లో భాగస్వాములవడంతో పరిపాలన ప్రశ్నార్థకంగా మారింది...
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన పాపానికి జనంపై పన్నుల మీద పన్నులు వేస్తున్నారు..
నిత్యావసర వస్తువుల ధరల నుంచి లిక్కర్ రేట్లు వరకు అన్నీ గణనీయంగా పెరిగిపోయాయి...
ప్రజల సొత్తును నెలకు రూ.90 వేలు జీతంగా తీసుకుంటున్న ఎంపీడీఓలు ఎమ్మెల్యే, వైసీపీ నేతల అనుమతి లేనిదే పంచాయతీ కుళాయి కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతోంది..
కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి అవినీతిలో మునిగితేలుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు..కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు...
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తిరుపతి ఎన్నికల ఫలితాన్ని తెచ్చుకునే బాధ్యత మనందరిపై ఉంది..
కేంద్ర మంత్రిగా పనిచేసి, మచ్చలేని నాయకురాలిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించుకుందాం..
పత్తిపాటి పుల్లారావు కామెంట్స్
విధ్వంసం, వినాశకం, అవినీతి, అక్రమాలు, దోపిడీనే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోంది..
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు..
వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈ రోజు పాలన చూసి విరక్తిచెందిన పరిస్థితి నెలకొంది...
వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడం అసంభవం..
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు, వైసీపీ నేతల భ్రమలను తొలగించేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దోహదం చేస్తుంది..
తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకుని చరిత్ర తిరగరాద్దాం...
నరసింహ యాదవ్ కామెంట్స్
ఏ ఘటన జరిగినా నోరువిప్పని ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే..
లక్షలాది మంది పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలకడం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి..
సోమిరెడ్డి కామెంట్స్
వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాధారణ పాలన కూడా కరువైంది...
నిత్యావసర సరుకులు, ఇసుక, లిక్కర్ ధరల నుంచి కరెంట్ చార్జీల వరకు అన్ని పెరిగిపోయాయి...
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు గొంతెత్తితే సస్పెండ్ చేసి బయటకు నెట్టేస్తున్నారు..ఇది ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం తీరు..
నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లా రైతులు మరోసారి నష్టాలబారిన పడ్డారు...నారుమడులు దెబ్బతినే రూ.160 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
ఎడగారు సీజన్ ధాన్యం ధరల విషయంలోనూ భారీగా నష్టపోయారు..మద్దతు ధర పుట్టికి రూ.15,700గా ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రూ.7 వేల నుంచి రూ.9 వేల లోపే తెగనమ్ముకున్నారు..
వైసీపీ నాయకులు, దళారులు కలిసి తక్కువ ధరలకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరకు అమ్ముకున్నారు..
రైతులు వందల కోట్లు నష్టపోతే జిల్లా నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఆదుకోమని కోరే ప్రజాప్రతినిధులు కరువయ్యారు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతులను ఆదుకుంటూ ముందుకు సాగాం...
వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి..రైతులకు కష్టాలు, సమస్యలు వస్తే పట్టించుకునే నాథులు కరువయ్యారు...
ఈ ఏడాదిన్నరలో ప్రజలు పడిన కష్టాలకు ఫలితం తిరుపతి ఉప ఎన్నికలో చూడబోతున్నాం...
నాయకులందరం ఐక్యంగా పనిచేసి ఉప ఎన్నికలో సత్తా చాటుతాం..తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకుంటాం...