ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సిపి నాయకులు.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

2023  నూతన సంవత్సరం సందర్భంగా సూళ్లూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కిలివేటి సంజీవయ్య కు  సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి, తడ మండల అధ్యక్షుడు కొలివి రఘు, సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, జెట్టి వేణు యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు, సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లోని సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు సూళ్లూరుపటలో ఉన్న వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు . ముందుగా ఆయన అభిమానులు యాపిల్ తో తయారు చేసినటువంటి భారీ పూలమాలను క్రేన్ సాయంతో ఎమ్మెల్యేని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసి  ప్రతి ఒక్కరికి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు.