కరోనా వైరస్ బారిన పడ్డ


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపూర్ణంగా కోలుకున్నారు. సోమవారం నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వైరస్ బారిన పడ్డ ఆయన చెన్నైలో స్వల్పకాలిక చికిత్స తీసుకున్నారు. వారం క్రితం ఆయనకు నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. అయినప్పటికీ ఆరోగ్య శాఖ నిభంధనల మేరకు అక్కడే ఉండి జాగ్రత్త పడ్డారు. కరోనా నుండి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంపూర్ణంగా కోలుకున్నారు. రేపు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కానున్నారు. లాక్ డౌన్ సమయంలో తను ప్రాతినిధ్య వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తన స్వంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేసి నిజమైన ప్రజా ప్రతినిధిగా నిలిచారు. ప్రజల ఆశీర్వాదం, దేవుని కృప వల్ల ఆయన సంపూర్ణంగా కోలుకుని సోమవారం హాస్పిటల్ నుండి డిశ్చార్స్ కానున్నాురు. సోమవారం నుండి ఆయన యధావిధిగా ప్రజలతో గడపనున్నారు.