తేది:27-10-2020
*నెల్లూరు జిల్లాలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన ఇంచార్జ్ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డిగారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వెలగపల్లి వరప్రసాద్ రావు గారు, కోటంరెడ్డి శ్రీధర్  రెడ్డి గారు, కిలివేటి సంజీవయ్య గారు,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గార్లతో పాటు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 నెల్లూరు జిల్లా ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను గెలిపించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించారు.

👉 జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సంతృప్తికరంగా సాగింది.

👉 స్థానికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం.

👉 అవినీతికి అలవాటు పడిన తెలుగుదేశం పార్టీ వాళ్లకి తమలాగే అందరూ అవినీతికి పాల్పడుతారని అనుకుంటున్నారు తప్ప, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు.

👉 సోమిరెడ్డి లాంటి వాళ్లకు ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యందే నిద్ర పట్టడం లేదు.

👉 అవినీతికి అలవాటు పడిన సోమిరెడ్డికి తనలాగే అందరూ అవినీతికి పాల్పడుతున్నారని అపోహ పడుతున్నాడు.

👉 సోమిరెడ్డి ఓటమిపాలై అధికారం కోల్పోయినా ఇంకా తాను అధికారంలో ఉన్నట్లు భ్రమ పడుతున్నాడు.

👉 వరుస ఓటమిపాలైన సోమిరెడ్డి ఇంక జన్మలో గెలవడు.

*సజ్జల రామకృష్ణా రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 వై.యస్.ఆర్. రైతు భరోసా పేరిట ముఖ్యమంత్రి గారు రెండో విడత నిధులు విడుదల చేసి రైతాంగానికి  అండగా నిలుస్తున్నారు.

👉 జిల్లాలో రికార్డు స్థాయిలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన రెండో పంట ధాన్యాన్ని మూడు లక్షల టన్నులను  రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశాము.

👉 ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ జీర్ణించు కోలేక ఆరోపణలు చేస్తున్నారు.

👉 తెలుగుదేశం పార్టీ దోషిగా నిర్ధారించి ప్రకటించిన వ్యక్తి తమ పార్టీకి  చెందినవాడని  తెలిసి నానా రాద్ధాంతం చేస్తుంది.

👉 రైతులకు అన్యాయం చేసిన వారు ఎంతటివారైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

👉 జిల్లా శాసనసభ్యులతో అన్ని అంశాలపైనా సమీక్ష సామరస్యంగా, సంతృప్తికరంగా సాగింది.