కోవూరు మండలం లోని పోతిరెడ్డి పాలెం తిప్ప గిరిజన కాలనీ లో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి శనివారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ జగనన్న కాలనీ లకు సంబంధించిన లేఅవుట్ ను పరిశీలించారు. లేఔట్లకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితం తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారి గెలుపు నల్లేరు మీద నడకే అయినా భారీ మెజారిటీ సాధనే ధ్యేయంగా పని చేద్దాం.
👉 ఎన్నికలప్పుడు కనిపించి, వాడుకొని వదిలివేసే పగటివేషగాళ్ళ పట్ల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.
👉 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచభూతాలను దోచుకొని తీవ్రమైన అవినీతికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు ముఖం చాటేసి, ఎన్నికలు రావడంతో కార్యకర్తల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు.
👉 కాలం చెల్లిన తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకొని ఉండకుండా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవవలసిన అవసరం ఉంది.
👉 ప్రజల్లో గుర్తింపు లేక, కార్యకర్తల వద్ద పరపతి లేక తమ ఉనికిని చాటుకునేందుకు తాము అది చేశామంటూ, ఇది చేశామంటూ, పేపర్లో ప్రకటనలు ఇచ్చుకునే స్థాయికి తెలుగుదేశం నాయకులు దిగజారి పోవడం దురదృష్టకరం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నందున తట్టుకోలేని, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన దొంగల ముఠా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుల పై బురద చల్లేందుకు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.
👉 తెలుగుదేశం హయాంలో అధికారం వెలగబెట్టి, శాసనమండలి సభ్యులుగా, మంత్రులుగా దోపిడీకి పాల్పడిన అవినీతి పరులు, తమ అవినీతి మరకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంటించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెత్తనం వెలగబెట్టిన వారు అవినీతే లక్ష్యంగా పని చేస్తే, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం.
👉 గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఉన్నత లక్ష్యంతో మంజూరు చేయించిన రూ-అర్బన్ పథకం తెలుగుదేశం హయాంలో అవినీతిలో కూరుకుపోతే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు రూ-అర్బన్ పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విశేషంగా కృషి చేసి, అందించగలిగాం.
👉 అధికారాన్ని అడ్డుపెట్టుకొని మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నడ్డి విరిచినవారు, తమని-తామే రైతుబంధువునిగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు.
👉 రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
👉 తెలుగుదేశం హయాంలో మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి, ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా రకరకాల ఉత్తర్వులు చూపించి, రైతులను మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అదనంగా అవసరమైన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతన్నలకు అండగా నిలుస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పాలనలో జరిగిన అవినీతి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించిన ప్రజలు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో భారీ మెజారిటీ సాధించేందుకు అందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దాం.
దిశ పోలీస్ స్టేషన్లో 45 పెట్రోలియం వాహనాలు, ఒక ఇంటిగ్రేటెడ్ వాహనాన్ని ప్రారంబించిన ఎస్పీ భాస్కర్ భూషణ్..
-
- పాల్గొన్న ఎఎస్పీ వెంకటరత్నం, శ్రీలక్ష్మీ, దిశ డిఎస్పీ నాగరాజు, టౌన్ డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి
- మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది..
- ఆపదలో ఉన్న బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పెట్రోలియం వాహనాలు ఉపయోగపడతాయి..
- దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయి
- అత్యాచార బాధితులకు అండగా ఉంటూ.. వారికి సత్వర న్యాయం చేసేందుకు దిశ అందుబాటులో ఉంటుంది..