ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం - మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం 

 రానున్న ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.సోమవారం
నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరిది అభివృద్ధి పాలన,ఎవరిది విధ్వంస పాలనో  ప్రజలకు తెలుసన్నారు. బూటకపు ప్రసంగాలు మాని, దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎవరి పాలన స్వర్ణ యుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు వైసిపి నాయకులకు దమ్ముందా అని ప్రశ్నించారు. జగన్ సిద్ధం అని సభలు పెడుతూ అశుద్ధం మాటలు చెబుతున్నాడని విమర్శించారు.2019 ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్ అన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టాడని, మిగిలిన వాళ్ళను  50 రోజుల్లో ప్రజలు మడత పెడతారని  తెలియజేశారు. పది రూపాయలు ఇచ్చి, వంద రూపాయలు దోసుకున్న జగన్ అభివృద్ధి గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ మూలనా అభివృద్ధి కనిపించకపోగా, ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం కనిపిస్తుందన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ వందల కోట్లు ఖర్చుపెట్టి సిద్ధం సభలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ నోటి నుండి వచ్చేవి అన్నీ అసత్యాలు,బూటకపు  ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు మాత్రమే అన్నారు. దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్ కు పేదల జీవితాలు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ సామాజిక ద్రోహి అని తెలిపారు.రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ, స్కూల్ బస్సులను లాక్కుని బలవంతంగా జనాన్ని రాప్తాడు సభకు తరలించారని తెలిపారు. రాప్తాడు సభ సక్సెస్ కాకపోవడంతో ప్రెస్టేషన్లో ఉన్న జగన్ వార్తలు కవరేజ్ చేయడానికి వచ్చిన విలేకరులపై రౌడీ గ్యాంగ్ తో దాడి చేయించారని తెలిపారు. వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం అన్నారు.తెలుగుదేశం పార్టీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారనిఅన్నారు. లక్ష కోట్ల రూపాయల  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులను జగన్ దారి మళ్ళించాడని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య,పార్లమెంట్ కార్యదర్శి శోభన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసాద్ నాయుడు, సాయికుమార్,కృష్ణం నాయుడు, వేంపల్లి వెంకటేశ్వర్లు, రాధా నాయుడు,సుబ్రహ్మణ్యం రెడ్డి,కన్నలి వాసు,నాగేందర్ నాయుడు,తిరుపతి పార్లమెంటు మహిళా ఉపాధ్యక్షురాలు చెందేటి సుజాతమ్మ, గుంట మడుగు సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు బంధిల లక్ష్మి, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నియోజకవర్గం బందిలి సాయి ప్రసన్న, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు పెళ్లకూరు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.