గిరిజనుల భూములు మ్యాపింగ్ అయ్యుంటేపట్టాలు అందిస్తాం.....

చిత్తూరు, జూలై 08 :  గిరిజనులు 2005 కంటే ముందు ప్రభుత్వ భూములను అనుభవిస్తుంటే, దానికి అనుగుణంగా గూగుల్ మ్యాపింగ్ అయ్యి ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు చట్ట ప్రకారం అంగీకారం అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త అన్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అటవీ హక్కుల చట్టంకు సంబందించి సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 440 క్లయిమ్ లు, 305 ఎకరాలకు సంబందించి గిరిజనులవి పెండింగ్ లో ఉన్నాయని, తిరుపతి డివిజన్ కు సంబందించి గోపాల పురం వద్ద 80 ఎకరాల్లో 41 క్లయిమ్ లు, చిత్తూరు డివిజన్ లో వెదురు కుప్పం మండలం జక్కిదొన లో 300 మందికి చెందిన 115 ఎకరాల్లో క్లయిమ్ లు, మదనపల్లి డివిజన్ లో సదుం మండలం బూరగమంద లోని 19 చెందిన 30 ఎకరాల క్లయిమ్ లు, అదే విధంగా పలమనేరు మండలం యం.కొత్తూరులో 80 ఎకరాలకు చెందిన 80 క్లయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయని, ఇందులో బూరగమందకు చెందిన 19 మందికి సంబందించి 30 ఎకరాల్లో సర్వే పూర్తయ్యిందని గూగుల్ మ్యాపింగ్ లో కూడా ఉన్నట్లు తెలుస్తుందని, అయితే పూర్తి స్థాయి విచారణ చేసిన తరువాత నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్.డి.ఓ లను కోరారు.  వన సంరక్షణ సమితి గ్రూపులకు సంబందించిన భూములు ఏవైతే గిరిజనుల అనుభవంలో ఉన్నాయో ఆ భూముల పై వారికి హక్కు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని, ప్రధానంగా 42 వన సంరక్షణ సమితి గ్రూపులు ఉన్నాయని, దీనికి సంబందించి 27,831.96 ఎకరాలు క్లయిమ్ లు ఉన్నాయని, అదే విధంగా వ్యక్తిగత క్లయిమ్ లు 793, 465 ఎకరాలకు సంబందించి రావడం జరిగిందని, ఇందులో 683 క్లయిమ్ లను 317 ఎకరాలను తిరస్కరించడం జరిగిందని, 110 క్లయిమ్ లకు సంబందించిన 148 ఎకరాల భూములకు సంబందించి పరిష్కారం జరిగిందని వివరించారు.  మ్యాపింగ్ లో 2005 కు ముందు ఎవరితే భూమిని అనుభవిస్తున్నారో వారు ప్రస్తుతం కూడా అనుభవిస్తుండాలని, అదే విధంగా సర్వే అధికారులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పొలం లో పంట ఉండాలని ఆ పంట గూగుల్ మ్యాపింగ్ లో నమోదై ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించిందని, దీని ప్రకారం సర్వే పనులను మరో 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్.డి.ఓ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తతో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, డి.ఎఫ్.ఓ నరేంద్రన్, తిరుపతి ఆర్.డి.ఓ కనకనరసారెడ్డి, చిత్తూరు ఆర్.డి.ఓ అధికారి రేణుక, గిరిజన సంక్షేమ అధికారి అబ్సలూం, గిరిజనుల సంఘాల తరపున రిటైర్డ్ ఆర్.డి.ఓ సరస్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు