తనపై ఏకంగా 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది... 2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది బాధితురాలు.. ఇప్పటికే కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు... యువతి ఫిర్యాదు ప్రకారం.. 139 మందిని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే, ఈ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమ్మాయిని ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఆ నిందితులు బలాత్కారం చేశారనేదానిపై పోలీసులు కొంత వరకు ఆరా తీశారు. మొదటిసారి ఎక్కడ అన్యాయానికి గురి అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసిన పోలీసులు.. బాధిత మహిళ పదో తరగతి పాస్ కాగానే కుటుంబ సభ్యులు వివాహం చేయడం.. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకి బాధిత మహిళ వివాహం చేసుకుని వెళ్లడం.. అయితే అక్కడే మొదటిసారి అత్యాచారానికి గురి అయినట్టు కూడా చెబుతున్నారు.
అత్తింట్లో లైంగిక దాడులు తప్పలేదు బాధితురాలికి.. భర్తతో కాపురం చేస్తున్న సమయంలో మామ బాధిత మహిళపై అత్యాచారం చేశాడు. అయితే ఈ విషయాన్ని భర్తకు చెబితే పట్టించుకోలేదు. ఆ తర్వాత భర్త సోదరులు కూడా బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో పాటుగా మరో ఇద్దరు కూడా మహిళపై అత్యాచారం చేశారు. వీళ్ళ అఘాయిత్యాలను భరించలేక మహిళల విడాకులు తీసుకుంది. తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక, తిరిగి చదువు ప్రారంభించిన సమయంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆ యువకుడితో పాటు బాధిత మహిళ హైదరాబాద్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత మహిళపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బాధిత మహిళను నమ్మించి దేశంలోని పలు ప్రాంతాల్లో తిప్పినట్టుగా చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోలకతా, నాగ్‌పూర్, పుణె లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లినట్టుగా సమాచారం. అక్కడ తన ఫ్రెండ్స్‌తో బాధిత మహిళపై రేప్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మెడపై కత్తి పెట్టి రేప్ చేశారని బాధితురాలు పేర్కొంది. మరికొన్ని సమయాల్లో బాధిత మహిళతో సెక్స్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీసినట్టుగా చెబుతున్నారు. నగ్నంగా ఫోటోలు తీశారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. 2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడం.. కొన్ని సందర్భాల్లో తనపై గ్యాంగ్ రేప్‌లు కూడా జరిగాయని పేర్కొనడం సంచలనంగా మారింది. వీడియోలు, ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డారని కూడా పేర్కొంది. ఈ అత్యాచారలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.