పోలీసులు వైసీపీ నేత‌ల్లా ప్ర‌వ‌ర్తిస్తే భ‌విష్య‌త్ లో భారీమూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌ద‌ని నెల్లూరు సిటి ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి హెచ్చ‌రించారు.. వాలంటీర్ చేత ఎన్నిక‌ల ప్ర‌చారం చేయిస్తున్నారంటూ.. త‌మ పార్టీ నాయ‌కులు పిర్యాదు చేస్తే..దాన్ని తీసుకోకుండా.. వాలంటీర్ ఇచ్చిన త‌ప్పుడు కేసును ఎలా న‌మోదు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గారంటూ మండిప‌డ్డారు.. ముత్తుకూరు పోలీస్ స్టేష‌న్ ఎదుట కోటంరెడ్డి త‌న అనుచ‌రులు, స్థానిక నేత‌ల‌తో క‌లిసి ఆందోల‌న చేప‌ట్టారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వాలంటీర్ల ద్వారా ఎలా ప్ర‌చారం చేయిస్తారంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. పోలీసులు న్యాయం వైపు నిల‌బ‌డాల‌ని, వైసీపీ నేత‌లు చెప్పిన‌ట్లు వింటే మాత్రం.. అంద‌రినీ గుర్తుపెట్టుకుంటామ‌ని హెచ్చ‌రించారు.