గూడూరు పట్టణ ముస్లింలతో ఎంపీ ఆత్మీయ సమ్మేళనం
చవటపాలెం సంఘటనలోని దోషులు తప్పించుకోలేరు
ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావుని ఘనంగా సన్మానించిన ముస్లింలు
గూడూరు: గూడూరు షాది మంజిల్ నందు ముస్లిం నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరు అయిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు మాట్లాడుతూ చవటపాలెం విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి,హోమ్ శాఖ మంత్రి కు మరియు సంబంధిత శాఖల అధికారులకు తెలపడం జరిగిందని దోషులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని దిశ చట్టం ఆషా మాషీ కాదని మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటిని క్షమించరని అన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన పని లేదని 160 రోజులు ఎవరైతే ఈ భారతదేశంలో వుంటారో వారికి దేశ పౌరసత్వం లభిస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్ఆర్సీ ని అమలు చేసేది లేదని ఇది వరకే ముఖ్యమంత్రి గారు చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు, ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని మేమంతా మీ వెంట ఉంటామని హామీ ఇచ్చారు, అలాగే షాది మంజిల్ కు 5 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి ప్రకటించారు,అలాగే ఖబరస్థాన్ కు 3 లక్షల రూపాయలను ఎంపీ నిదుల నుండి ప్రకటించారు. డిప్లొమా ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్. రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని షాది మంజిల్ నిర్మాణం కు అప్పట్లో బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు చేసిన సహాయం గూడూరు మైనారిటీలు మరువలేరు అని అన్నారు. ముఖ్యంగా ఈ రోజు చవటపాలెం ఒక మతి స్థిమితం లేని యువతి పై జరిగిన హత్యాచారం ను ఖండిస్తూ దోషులకు మరణ శిక్ష విధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు విన్నవించిన మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ మగ్ధుమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పక్షపాతి అని ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగితే వారు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగిందని కానీ దోషులను తప్పించాలని చూసే వారి పై కూడా దిశ చట్టాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అలాగే మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ అధ్యక్షుడు రహీం మాట్లాడుతూ దోషులను తప్పించుకోకుండా శిక్ష పడేట్లు చూడాలని ఎంపీ గారిని కోరారు. మైనారిటీ నాయకులు సమీ హుస్సేనీ మాట్లాడుతూ చవటపాలెం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేట్లు శిక్షలు అమలు చెయ్యాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు షేక్. రియాజ్ అహ్మద్, నాజర్,బాబా,అజీజ్,కరిముల్లా,కాలేష,షఫీ, అజీజ్, గపూర్,సందాని, జమీర్,షాకిర్,బాబు, అన్వర్,పడియాల్ శ్రీహరి,యోగి,జబ్బార్ మౌలానా, మొహమ్మద్ యూసుఫ్ మరియు ముస్లిమ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
i