ఎరుకయ్య మరువలేనివి నీ  సేవలయ్య.....

మర్రిపాడు :వ్యవసాయ కార్మిక,  రైతు, కష్టజీవుల ఆశ జ్యోతి బత్తల ఎరుకయ్య మండలానికి చేసిన సేవలు మరువలేని వని , ఆ విప్లవ కారుడిని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని మండల సి పి ఎం నాయకులు మూలి వెంగయ్య తెలిపారు. మర్రిపాడు మండలం లోని ఇసుక పల్లి గ్రామంలో ఎరుకలయ్య  స్తూపం వద్ద జరిగిన ప్రధమవర్ధంతి సభలో భాగంగా ఆయన మాట్లాడారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు జీవుల ఆశాజ్యోతి ఎరుకల య్య ఆశయాల కోసం అందరం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. మండలంలోని  గ్రామాలలో సమస్యల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజల సమస్యలపై పోరాడాడాడని ఆయన తెలిపారు.  కుడు, గూడు, బట్ట,  విద్య, వైద్యం అందరి పేదవారికి చందాల న్నది ఎరుకల య్య ఆశయం అని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్, జిల్లా సిఐటియు నాయకులు బత్తల కృష్ణయ్య, మండల కమిటీ సభ్యులు యువజన నాయకులు పాల్గొన్నారు.