డాక్టర్ అంబేద్కర్ రాజగృహం పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం :
డాక్టర్ అంబేద్కర్ రాజగృహం పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి... అంబేద్కర్ ఇండియన్ మిషన్ (AIM)✊
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజగృహ పై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు పట్టణంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్, ప్రజాసంఘాలు,దళిత సంఘాలు, సిపిఐ, సిపిఎం, ఎమ్మార్పీఎస్ స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో న్యాయ వాది నందా ఓబులేసు మాట్లాడుతూ ఈ నెల జులై ఏడో తేదీన ముంబైలోని భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నివాసం రాజ గృహంపై దాడి అంటే అది భారత రాజ్యాంగం పై దాడి చేయడమే అని అన్నారు. దేశానికీ దిశ, దశ చూపిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జ్ఞాన సంపద కి చిహ్నమైన గృహ కే రక్షణ కొరవడితే సామాన్యులకు బహుజనులకు భద్రత ఎక్కడ ఉంటుంది అన్నారు.
ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ జిల్లా మాజీ సభ్యులు
దావా పెంచల రావు మాట్లాడుతూ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరియు మహారాష్ట్ర వారు తక్షణమే స్పందించి విచారణ జరిపి,నిందితులను పట్టుకొని, ఈ కుట్ర వెనుక దాగి వున్నా అసలైన దుష్ట శక్తులు లను బయటకు లాగి వారి పై ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ కేసు తో పాటు రాజద్రోహం కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమం లో అంబేద్కర్ ఇండియన్ మిషన్ (AIM)సభ్యులు, ప్రజా సంఘాలు నాయుకులు ,ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ జిల్లా మాజీ సభ్యులు,ఎస్ యన్ పి ఎస్ నాయకులు, సిపియం, సిపిఐ, ఎమ్మార్పీస్ నాయుకులు, మైనారిటీ నాయుకులు, స్వచ్చంద సంస్థ ప్రతి నిధులు, మహిళలు, అంబేద్కర్ అభిమానులు, యువకులు, పాల్గొన్నారు.