*నివర్ తుఫాన్ బాధిత నిరుపేద వృద్ధురాలిని ఆదుకున్న మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి శ్రీమతి మౌనిక రెడ్డి
*నివర్ తుఫాన్ బాధిత నిరుపేద వృద్ధురాలిని ఆదుకున్న మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి శ్రీమతి మౌనిక రెడ్డి
అది వెంకటగిరి మండలంలోని అమ్మపాలెం అనే కుగ్రామం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు అయిన *నగరం ఆదెమ్మ* పూరి గుడిసె వాన నీటిలో మునిగిపోయింది. దిక్కు తోచక ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో... హైదరాబాదులో ఉన్న
*మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి & మేనేజింగ్ ట్రస్టీ* అయిన *శ్రీమతి మౌనిక రెడ్డి గారు* సోషల్ మీడియాలో ఆ వృద్ధురాలి గురించి తెలుసుకొని... వెంటనే *MCF ట్రస్ట్* వాలంటీర్ అయిన హరి ని స్వయంగా ఆ గ్రామానికి పంపి ఆ వృద్ధురాలికి కావలసిన *ఒక రై స్ బ్యాగే తో పాటు నిత్యావసర వస్తువులను వెనువెంటనే సమకూ ర్చారు మరియు వానకి అన్ని బట్టలు పాడవ్వడం తో వాటితో పాటు కొత్త చీరలు 2 ఒక కొత్త దుప్పటి కూడా సమకూర్చారు*
హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా త్వరలో తాను అమ్మపాలెం లోని ఆ వృద్ధురాలి ఇంటికి వస్తానని ఆమెకు తదుపరి ఆర్థిక సహాయం కూడా చేస్తానని తెలియజే సారు. అనాధ వృద్ధురాలికి సరియైన సమయంలో సహాయం అందించిన శ్రీమతి మౌనిక రెడ్డి గారి మానవత్వానికి ఆమె మంచి మనసుకి మనమంతా అభినందనలు తెలుపుదాం.