రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో .... శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లను నరకకూపాల్లా మార్చింది. టీడీపీహాయాంలో రూ.3,690కోట్లతో 6,694 కిలోమీటర్ల రోడ్లేస్తే, మంత్రిపెద్దిరెడ్డి కేవలం 330కిలోమీటర్లని దుష్ర్పచారంచేస్తున్నాడు.
శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ( టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రివర్యులు)
రాష్ట్రంలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారిపోయాయని, రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, ఆఖరికి గాయాలపాలైన వారిమూలంగా వైద్యులకుపనిపెరిగిందని, ఈ మాట స్వయంగా భీమవరం వైసీపీఎమ్మెల్యేనే చెప్పారని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ మూతపడింది. వాహనదారులు గుంతల్లోపడిప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఏఐబీకింద టీడీపీప్రభుత్వంలో మొదలైన రూ.4,500 కోట్లపనులను ఈ ప్రభుత్వం రాగానే ఆపేసింది. టీడీపీప్రభుత్వం, ఎన్ డీబీ కింద రూ.6400కోట్లరుణానికి అనుమతులు తీసుకొస్తే, ఈ ప్రభుత్వం 30శాతంవాటా చెల్లించలేక, వాటిని పోగోట్టుకుంది. 20, 30 సంవత్సరాలకు చేసే చెల్లింపులుకూడా చేయలే మంటేఎలా? రాష్ట్ర వాటాకింద చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేని దుస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చింది. మంత్రులేమో తమ పదవులుఎన్నాళ్లుంటాయోనన్న ఆందోళనలో వారిశాఖలను పూర్తిగా గాలికొదిలేశారు. మంత్రి శంకర్ నారాయణకు ఏఈబీ, ఎన్ డీబీ అంటే ఏంటి, ప్లాన్ కు నాన్ ప్లాన్ కు ఉన్నవ్యత్యాసమేంటో కూడా తెలియదు. ఒకసంవత్సరంలో రోడ్లన్నీ వేసేస్తామని మంత్రి శంకర్ నారాయణ చెప్పడం హాస్యాస్పదంగాఉంది. పీఎంజేఎస్ వై కింద టీడీపీప్రభుత్వంలో 2,634కిలోమీటర్ల వరకు రోడ్లనిర్మాణం చేశాం. ఎస్సీ సబ్ ప్లాన్ కింద, రూ.848కోట్లతో 1370కిలోమీటర్ల రోడ్లు, రూ.711కోట్ల నరేగానిధులతో 2,230కిలోమీటర్లవరకు రోడ్లు వేయడం జరిగింది. టీడీపీప్రభుత్వంలోనే రూ.594కోట్లతో 1277 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లను బీటీరోడ్లుగా మార్చడంజరిగింది. 250కు పైబడి జనాభాఉండే రోడ్డుసౌకర్యంలేని గ్రామాలకు, రూ.408కోట్లతో రోడ్లువేయడంజరిగింది. మొత్తంగా రూ.3,690 కోట్లతో 6,694కిలోమీటర్లవరకు రోడ్లను టీడీపీప్రభుత్వం వేయడం జరిగింది. రోడ్లనిర్మాణం ప్లాన్ లో మూడురకాలుంటాయి, అవి ఎమ్ డీఆర్ (మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, కోర్ నెట్ వర్క్ (హెవీట్రాఫిక్ రోడ్స్) ఆర్ ఆర్ (రూరల్ రోడ్స్). ప్లాన్ కింద ప్రతిఏటా రూ.1000కోట్లు ఖర్చుచేస్తే, నాన్ ప్లాన్ అంటే గతుకులు పూడ్చటం, ఇతరమరమ్మతులకు ప్రతిఏటా రూ.500కోట్లనుంచి రూ.600కోట్లవరకుఖర్చుపెట్టాం. అవికాకుండా పంచాయతీరాజ్ శాఖలో రూ.4,500కోట్లరుణాన్ని ఏఐబీ ద్వారా తీసుకొచ్చాము. ఆరుణంతో పనులుచేయడానికి 44ప్యాకేజీలు టెండర్లు పిలవడం జరిగింది. దాదాపు రూ.600కోట్లవరకు ఖర్చుచేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రవాటాచెల్లించాల్సివస్తుందని ఆ పనులన్నింటినీ ఆపేయించింది. ఈ 44ప్యాకేజీల్లో నెల్లూరులో చిత్తూరులోమాత్రమే పనులుజరిగాయి. మిగతా 11జిల్లాల్లో ఎక్కడ ఇప్పటికీ ఒక్కపని కూడా ప్రారంభంకాలేదు. నాబార్డ్ (ఎన్ ఐడీఏ) కింద రూ.1100కోట్లు వైసీపీప్రభుత్వం మంజూరు చేయించుకుంది. వాటిలో 30శాతం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని, శాంక్షన్ అయిన పనులను ప్రీక్లోజర్ చేయడం జరిగింది. ప్రీక్లోజర్ చేయడానికి ఏపీ ఆర్థికశాఖ కొత్తకొత్త నిర్వచనాలుచెబుతోంది. ఒక్కసారి పనులు ప్రారంభమై తిరిగి ప్రీక్లోజర్ చేస్తే, తిరిగి ఐదేళ్లపాటు ఆపనులను చేయడానికి వీల్లేదనే నిబంధన తీసుకొచ్చింది. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? రోడ్లుభవనాలశాఖ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన రోడ్లనిర్మాణపనులన్నింటినీ ఆపేశారు. పీఎంజేఎస్ వై కింద 330కిలోమీటర్లు మాత్రమే గతప్రభుత్వంలో రోడ్లువేసినట్లు మంత్రిపెద్దిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం కేవలం రోడ్లనిర్మాణానికి ఐదేళ్లలో రూ.820కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని సాక్షి పత్రిక దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీప్రభుత్వ నొక్కుడు భరించలేకే కాంట్రాక్టర్లుఎవరూ రోడ్లు వేయడానికి, టెండర్లలో పాల్గొనడానికి ముందుకురావడంలేదు. సీఎఫ్ఎంఎస్ పద్ధతిలో టీడీపీప్రభుత్వం కాంట్రాక్టర్లకు పారద ర్శకంగా చెల్లింపులుచేసింది. ఇప్పుడేమో ఎవరుడబ్బులిస్తే, వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. టీడీపీ హాయాంలో ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్ పద్ధతి అమలైతే, వైసీపీప్రభుత్వంలో పిక్ అండ్ పే పద్ధతిని ఫాలోఅవుతున్నారు. ఏ కాంట్రాక్టర్లు అయితే 15శాతం కమీషన్ ముట్టచెప్పుకుంటాడో, వారికే ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల అవుతున్నాయి. టీడీపీప్రభుత్వంలో అమలైన ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్ విధానానికిస్వస్తిపలికారు. సీఎంవో లంచాలిచ్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు. ఏ ఫైల్ క్లియర్ చేయాలన్నా, సత్యనారాయణ 90రోజుల సమయం తీసుకుంటారని చెబుతున్నారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని నాశనంచేసే అధికారం సత్యనారాయణకు ఎవరిచ్చారు? అలాంటప్పుడు సీఎఫ్ఎంఎస్ పద్ధతినే ఈ ప్రభుత్వం తీసేయొచ్చు కదా? మంత్రి బుగ్గన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్థికశాఖా మంత్రి బిల్లులచెల్లింపునకు సంబంధించి ఆదేశాలివ్వడానికి లేదని నేరుగా సీఎంవో నుంచే ఆదేశాలిచ్చారు. ప్రజలప్రాణాలతో ఆడుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చా రు? రాష్ట్రానికి దుర్గతి పట్టించారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకొచ్చింది. ప్యాచ్ వర్క్ చేయడానికి జనసేన ముందుకొస్తే, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటి?