సూళ్లూరుపేట లో బీజేపీ నాయకుల ఆద్వర్యంలో మెగా రక్త దాన శిబిరం.
సూళ్లూరుపేట లో బీజేపీ నాయకుల ఆద్వర్యంలో మెగా రక్త దాన శిబిరం.
తిరుపతి జిల్లా.సూళ్లూరుపేట:-
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జన్మదిన శుభ సందర్భంగా 17వ తేదీ నుండి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, పట్టణాల్లో మరియు గ్రామాల్లో కూడా విస్తృతంగా కార్యకర్తలు మరియు నాయకులు ప్రజలతో మమేకమై అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సూళ్లూరుపేట బిజెపి కార్యకర్తలు మరియు మహిళ కార్యకర్తల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు బిజెపి తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఆరని విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ బిజెపి లోకల్ స్థాయి నాయకులు మహిళ స్థాయి నాయకులు మరియు జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సకాలంలో రక్తమంధక ఎందరో ప్రాణాలు పోతున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రక్తదాన శిబిరాన్ని సౌజన్యంతో ఏర్పాటు చేశారని అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ, మండల బీజేపీ నాయకులు వున్నారు.