నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.