అధికారులు అవమానిస్తున్నారంటూ 

వైసీపీ కో అప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి ఆవేదన.

గౌరవం లేకుంటే  రాజీనామా కు సిద్ధం.

అక్రమాలకు అధికారులే అండ.

బియ్యం స్మగ్లింగ్, గుట్కా , హాన్స్ విక్రయాలు జోరుగా కొన సాగుతున్నా అధికారులకు కనిపించడం లేదా.

అధికారులకు వర్గాలతో ఏమి అవసరం.

ప్రజలకు పని చేయకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా అడగాలి.

ప్రెస్ మీట్ లో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి ఆక్రోశం.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట లో ప్రభుత్వ అధికారులు కొందరు తమ పట్ల అవమానకరంగా,అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని అధికారులే అక్రమాలకు అండగా నిలుస్తున్నారని మునిసిపల్ కో అప్షన్ 

సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి ఆరోపించారు, ఆదివారం ఆయన నివాసం లో 

ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో అధికార వైసీపీ కి చెందిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి మాట్లాడుతూ కొందరు ప్రభుత్వ అధికారుల పైన పలు విమర్శలు చేశారు,

కౌన్సిలర్లను ,కో అప్షన్ సభ్యులను అధికారులు అగౌరవంగా మాట్లాడటం

అవమానకరంగా ఉందని అన్నారు, ఇక్కడ జరుగుతున్నా బియ్యం స్మగ్లింగ్, గుట్కా, హాన్స్ 

వంటి అక్రమ వ్యాపారాలకు అధికారులే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు, 

అధికారుల వ్యవహార శైలి చుస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని , తనపై చేస్తున్న 

స్మగ్లింగ్ ఆరోపణను రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని ఛాలంజ్ చేశారు. నాకు అవమానం జరిగింది నాకు న్యాయం చేయండి చేయలేక పొతే రాజీనామా చేస్తానంటూ సునీల్ రెడ్డి ప్రకటించారు. ఓ అధికారి సెల్ ఫోన్ లో తనను తిట్టిన మాటలను మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులకు వినిపించారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని అన్నారు.