నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సిలో.., గురువారం ఉదయం కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్  డా. ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి.., ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, జిల్లా వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి..? అన్ని ఆస్పత్రుల్లో మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా..? అని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలను అడిగారు. జిల్లాలో
అన్ని ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ మహమ్మారి నిర్మూలణలో మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నా కలెక్టర్.., వచ్చే రెండు నెలలు ఎంతో కీలకమని, దానికి తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. తమ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందింస్తూ.., వైద్యులు, నర్సులు, మెడికల్ స్టాఫ్ కరోనా భారిన పడ్డారని.., అందువల్ల సేవలు అందించడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆస్పత్రి యాజమాన్యాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.