*అమ్మాయి జేబులో చేయి పెడితే త‌ప్పేంటి?* 

 *కామెడీ చేసి న‌వ్వించే టాలెంట్ ఉన్నా మాస్ట‌ర్ దాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. టాస్క్‌ల్లో ఆయ‌న్ను ఎవ‌రేమ‌న్నా స‌హించ‌లేకపోయేవాడు. స్పోర్టివ్‌గా తీసుకోవ‌డానికి బ‌దులు ప్ర‌త్య‌ర్థుల‌కు శాప‌నార్థాలు పెట్టేవాడు. దీంతో ఇప్ప‌టికీ ఇంటిస‌భ్యులు మాస్ట‌ర్‌ను ఒక మాట అనాలంటే భ‌యంతో వెన‌క‌డుగు వేస్తున్నారు. మ‌రోవైపు ఈ వారంలో ఆయ‌న చేసిన త‌ప్పుల‌నే బిగ్‌బాస్ ఎత్తి చూపుతూ టార్గెట్ చేశారు. ముందుగా హారిక‌ చాక్లెట్ తీసుకుందన్న కోపంతో ఆమె మీద ప‌డి మ‌రీ చాక్లెటు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. పైగా త‌ను అమ్మాయి జేబులో చేయి పెడితే త‌ప్పేంట‌ని ఎదురు ప్ర‌శ్నించ‌డం ప్రేక్ష‌కుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.*