నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ( మేలుజాతి రామచిలకలు )

 గ్రీన్ వింగ్  మక్కల్ పక్షులు స్వాధీనం 



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున చేపట్టిన వాహనాల తనిఖీలో (మేలుజాతి రామచిలకలు) గ్రీన్ వింగ్ మక్కల్ పక్షులు రెండు బోర్లలో బంధించి అక్రమంగా తరలిస్తున్న మారుతి షిఫ్ట్ టూర్ కారు TN 11 AJ 8482 తో పాటు  డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  సి ఐ. RUVS. ప్రసాద్ వెల్లడించారు.


విజయవాడ నుండి చెన్నైకి తరలిస్తున్నట్లు పొంతనలేని సమాధానం చెప్పడంతో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని వాహనాలు తనిఖీ చేయగా రెండు బోన్లలో సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే  8 గ్రీన్ వింగ్ మక్కల్ పక్షులు అక్రమంగా బంధించి ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు షిఫ్ట్  కారు, చెన్నై పెరియార్ నగర్ సిక్స్త్ స్ట్రీట్ కు చెందిన మురుగేశన్ యాదవ్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పులికాట్ బర్డ్ సెంచరీ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట వారికి అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.


ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎం ఎస్ కానిస్టేబుల్ బి వేణుగోపాల్ పి హరిబాబు పాల్గొన్నారు.


చట్ట వ్యతిరేకంగా వన్య ప్రాణులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు.