తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించని గొప్ప మహానుభావులు...పొట్టి శ్రీరాములు .మహాజనసైన్యం(MJS) రాష్ట్ర అధ్యక్షుడు యల్లసిరి నాగార్జు
*తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించని గొప్ప మహానుభావులు...పొట్టి శ్రీరాములు గారు*
*....మహాజనసైన్యం(MJS) రాష్ట్ర అధ్యక్షుడు యల్లసిరి నాగార్జున గారు*
ఆంధ్రరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అతి ముఖ్యమైన వ్యక్తి, నిష్కయోగి, స్వార్థరహిత దేశ భక్తుడు సర్వసంగపరిత్యాగి అయిన పొట్టి శ్రీరాములు! ఆంధ్రుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు.సహాయ నిరాకరణోద్య మంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కారాగార శిక్షలు కూడా అనుభవించారు.
హిందూ సంఘసంస్కరణ నెలకొల్పి అస్పృశ్యతానివారణ, బాల్య వివా హ నిషేధం, వితంతు వివాహప్రోత్సాహం, మూఢాచార నిర్మూలనకు ఎంతో కృషి చేశారు.
ఆంధ్ర రాష్ట్రా వతరణకై 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీరాములు కఠోర నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించసాగింది. ఆయన ఆరోగ్య పరిస్థితికి యావ దాంధ్ర దేశం ఆందోళన చెంది "ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి! శ్రీరాములు ప్రాణాలు కాపాడండి" అంటూ నినాదాలు చేశారు.ప్రముఖ ఆంధ్ర నాయకులు దీక్ష విరమించ మని శ్రీరాములును కోరినా తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించలేదు. ఈ నిరాహార దీక్ష ఒక యజ్ఞంగా నిరంతరంగా 58 రోజులపాటు కొనసాగింది. డిసెంబర్ 15వ తేదీ రాత్రి శ్రీరాములు అమరుడయ్యారు. శ్రీరాములుగారి నిరుప మాన త్యాగ ఫలితంగా ఆయన మరణా నంతరం 1953 అక్టోబరు 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఆంధ్రరాష్ట్రావతారణతోనే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రేరణ లభించింది.