నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, మడమనూరు గ్రామ పంచాయతీ పరిధిలో  పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసి, గ్రామ సచివాలయంలో  అధికారులతో సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే మడమనూరు గ్రామ సచివాలయ పరిధిలో 4 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం జరిగింది.

గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ  పింఛన్లను నేరుగా ఇంటికే చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది.

జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని  చంద్రబాబు కోర్టు ల ద్వారా అడ్డుకునే పరిస్థితి

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నింటినీ అధిగమించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలను వారి పేరిట రిజిస్టర్డ్ చేసి ఇస్తాము.

వైయస్సార్ కాంగ్రెస్  ప్రభుత్వం అన్ని వర్గాల  సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.

గ్రామాలలోని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.

గ్రామాల్లో కూడా ప్రజలతో సమీక్ష నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మీ ఇంటి బిడ్డలగా, మీకు ఎల్లవేళలా అండగా ఉంటాను.