కరోనా సంక్షోభంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరు లక్షల రూపాయల చెక్ ను నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారికి లైఫ్ ఇన్స్యూరెన్సు ఏజెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా నెల్లూరు డివిజన్ వారు అందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ జనరల్ సెక్రటరీ కే.వేణుగోపాల్ రెడ్డి,  ట్రెజరర్ జి.వెంకటేశ్వర్లు, నెల్లూరు దర్గామిట్ట లోకల్ బ్రాంచ్ నాయకులు ఎస్.కే.శాహుల్ హమీద్, వి.బాబూరావు, వై.వి.శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.