కృష్ణా జిల్లాలో రెండు తలల దూడ జననం
కృష్ణా జిల్లాలో రెండు తలల దూడ జననం...బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందా... ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, రెడ్డి గూడెం మండలం, రుద్రవరం గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్నగరికపాటి వెంకటేశ్వరావు అనే రైతుల ఇంట్లో నెలల నిండిన ఓ ఆవు ప్రసవించగా రెండు తలలు ఉన్న దూడకు జన్మనిచ్చింది. ఈ వింత దూడకు రెండు తలలు పనిచేస్తుండటం విశేషం. అయితే స్థానికులు ఈ వింతను చూసేందుకు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇలాంటి విషయాలే చెప్పగా, అవి నిజం అవుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. తాజా కరోనా నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో కాలజ్ఞానం నిజం అవుతోందేమో అనే సందేహాలు భక్తుల్లో కలుగుతున్నాయి. పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు కరోనా నేపథ్యంలో కొంచెం అటు ఇటుగా జరుగుతున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో చాలానే చోటుచేసుకున్నట్లు భక్తులు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వింత దూడ జననం అనిన మ్ముతున్నారు. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి అనే వ్యాధి ఇప్పుడు కరోనా వైరస్ ఒకటే అని, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.