రాష్ట్రానికి సీఎం నిచ్చిన , ఘనత కుప్పం ప్రజలది...
 
టిడిపి ఆశాభవం...

టిడిపి పాలన లో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే కుప్పం ప్రజలు నారా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తోనే సాధ్యపడిందని.... టిడిపి సాధికారిక సమితి మెంబర్స్ రుద్రకోటి సదాశివం  , జగన్నాథం లు ఆశాభాగ్యం చేశారు. ..  ప్రెస్ క్లబ్లో శుక్రవారం టిడిపి నేతలు లక్ష్మీపతి నాయుడు , మైనం బాలాజీ , రాజయ్య తదితలతో కలిసి వీరు మాట్లాడుతూ.. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి... నేడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ... పులివెందుల ప్రజలు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. తమకు పదవులు ఇచ్చి గౌరవించిన టిడిపి అధిష్టానం కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.. నేడు శుక్రవారం కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ సభకు  జనాన్ని తరలిస్తున్నారని ,  స్థానిక కుప్పం ప్రజలు ఇంటికే పరిమితమయ్యారని... కుప్పం జనం ఆవేదన 2024లో తిరిగి చంద్రబాబును సీఎం చేస్తుందని కొనియాడారు..  జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ బస్సులను బలవంతంగా జగన్ సభకు తరలించడం అన్యాయమని.. తమ టిడిపి పాలనలో. .ఆర్టీసీ బస్సులకు డబ్బులు చెల్లించి.. అవసరమైతే ప్రైవేట్ వాహనాలను కూడా అవసరాల నిమిత్తం వారికి సదుపాయాలు కల్పించి వాహనాలను వాడుకున్నామే గాని.. ఇలా బలవంతంగా బస్సులను తీసుకోలేదని గతాన్ని గుర్తు చేశారు..