నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు , జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు ఎంత స్టాక్ వచ్చింది.... సబ్ సెంటర్లకు ఎంతమేర పంపుతున్నారు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు... అర్బన్ హెల్త్ సెంటర్లకు పక్కాగా కోవిడ్ వ్యాక్సిన్ చేరాలన్నారు.... ఈ సందర్భంగా డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మికి ఉన్నతాధికారులు పలు సూచనలు జారీ చేశారు.... కోవిడ్ వ్యాక్సిన్ స్టాక్ పాయింట్ ను పరిశీలించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు జాగ్రత్తలు చెప్పారు
.. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 నివారణ కు సంబంధించి వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు, వ్యాక్సిన్ ఇవ్వటానికి కావలసిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.వి.ఎన్. చక్రధర్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి అధికారులతో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ , డాక్టర్ .శ్రీనాథ్ రామమూర్తి , కోల్డ్ చైన్ ఆఫీసర్ నరేష్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వార టాస్క్ ఫోర్స్ అదికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రానున్నందున జిల్లాలో వ్యాక్సిన్ నిల్వ చేయుటకు వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు సిద్దం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశలో 23,547 మందికి వ్యాక్సిన్ ఇవ్వవలసినందున అందుకు సంబందించిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ కోల్డ్ చైన్ పాయింట్ నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, అక్కడ నుండి వ్యాక్సినేషన్ పాయింట్ కు చేర్చటానికి సంబందించిన ఏర్పాట్లు పూర్తి చెయలన్నారు. వ్యాక్సిన్ ఇవ్వటానికి సంబందించిన డేటాను చెక్ చేసుకోవాలన్నారు. రూట్ మ్యాప్ , మాన్ ప్లాన్ ఉండాలన్నారు . జనవరి 15 నాటికి జాబితా సిద్దం చేయాలన్నారు.ఇందుకు గాలి వెలుతురు ధారాళంగా ఉండే వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్ , గ్రామ సచివాలయ భవనాలు, స్కూల్ బిల్డింగ్స్ ఉపయోగించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ఇచ్చేవారికి ఇప్పటి నుండే తగు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ .ప్రభాకర్ రెడ్డి, రెవిన్యూ డివిసినల్ అధికారి హుస్సేన్ సాహెబ్ , జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ .రాజ్యలక్ష్మి, జిల్లా టాస్క్ ఫోర్స్ అదికారులు పాల్గొన్నారు*
జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని కోరుతూ పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు పీసీఐ ఓ తీర్మానం చేసింది. హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించి వారికి ఇతరులకు అందిస్తున్న బెనిఫిట్స్ ను వర్తింపజేస్తుందని పీసీఐ తెలిపింది. కనుక కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని పీసీఐ కోరింది.
కాగా కరోనా నేపథ్యంలో చనిపోయిన ఇద్దరు డాక్టర్ల కుటుంబాలకు కేంద్రం ఇటీవలే రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేసింది. సరిగ్గా అలాంటి ప్రయోజనాలనే జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని పీసీఐ కోరింది. ఇక ఈ విషయమై పీసీఐతోపాటు జర్నలిస్టు యూనియన్, ఇండియన్ న్యూస్ కెమెరామన్ అసోసియేషన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రధాని మోదీకి మెమొరాండం కూడా సమర్పించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఇదే విషయంపై సానుకూల వైఖరిని కనబరిచారు. మరి కేంద్రం జర్నలిస్టుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.