నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రహదారులతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు.. రూరల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ మిట్ట ప్రాంతంలో అత్యధికంగా రోజువారి కూలి పనులు చేసుకునే కార్మికులు, పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు.. ఈ ప్రాంతం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకనే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు .నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ కు ఈ ప్రాంత సమస్యలను ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేసామన్నారు... 25 వ డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని కోటం రెడ్డి పేర్కొన్నారు... రూరల్ లోని అన్ని ప్రాంతాల పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి డివిజన్ ను ప్రస్తావించినప్పుడు 24వ డివిజన్ గా పేర్కొనడం గమనార్హం... తిరిగి ఆయన 25 వ డివిజన్ గా గుర్తించి మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు సరిచేశారు*
‘‘చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం ’’ అన్న మహాత్ముని సూక్తిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మననం చేసుకున్నారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి అని మంత్రి పేర్కొన్నారు. ఇద్దరు మహనీయులు ఒకే రోజున జన్మించడం , దేశం కోసం వాళ్లు చేసిన త్యాగాలు,సేవలను స్మరించుకోవడం భారతీయులుగా గర్వించదగినవని మంత్రి మేకపాటి ఆ మహనీయులను కొనియాడారు. ఎవరికీ సాధ్యం కాని అహింస మార్గంలో నడవడం వల్లనే గాంధీ 'మహాత్ముడి'గా అవతరించారన్నారు. 'జై జవాన్ జై కిసాన్' నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గ్రీన్ రెవల్యూషన్ కి బాటలు వేశారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, లాల్ బహదూర్ శాస్త్రి జైజవాన్ జై కిసాన్ నినాదాలకు ప్రతిరూపమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనగా మంత్రి మేకపాటి అభివర్ణించారు.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా మంత్రి మేకపాటి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి ఐ.టి., పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, గాంధీ సేవలను కొనియాడి, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.