కొమ్మనేటూరు ఎంపిటిసి ఇండిపెండెంట్ అభ్యర్థి గా గెలుపొందిన గడ్డం వెంకటయ్య సుబ్బయ్య


 ⬜ ఎమ్మెల్సీ సమక్షంలో వైసీపీలో చేరిక


 🟩 చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి


 🟦 ఎంపీపి అభ్యర్థులు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ


 ⬜ అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు


 🟩 రాజకీయాల్లో అరితేరుతున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి


 🟦2020 లో చిల్లకూరు మండలంలోని కడివేడు, తోనుకుమాల ఎంపీటీసీ లను ఏకగ్రీవం చేసినకళ్యాణ్ చక్రవర్తి 







వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో సునామీ సృష్టించింది,ప్రతీ మండలంలో జడ్పీటీసీ, ఎంపిటిసి కైవసం చేసుకుంది, ఈ నెల 24,25 తేదీల్లో ఎంపిపి,జడ్పీ చైర్మన్ ఎన్నిక కానున్న తరుణంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఎంపిపి అభ్యర్థులు ఎంపిక వైసీపీ అధిష్ఠానం కు తలనొప్పిగా మారింది.


 కారణం వైసీపీలో వర్గపోరు,దింతో మండలాల వైసీపీ నేతలు ఎంపిటిసి అభ్యర్థులను తీసుకొని  ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ని కలుస్తూ పంచాయితీ లతో సర్దుబాటుచేసుకుంటున్నారు,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి సమయ స్ఫూర్తితో వ్యహరిస్తూ వైసీపీలో వర్గపోరుకు చెక్ పెడుతూ వైసీపీని బలోపేతం చేస్తూ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపల్లి కి తోడు నీడ గా నిలుస్తున్నారు,పిన్న వయస్సులోనే ఎమ్మెల్సీ సాధించిన కళ్యాణ్ అనతి కాలంలోనే దివంగత నేత మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు కు తగ్గ తనయుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు.


 ఈ నేపథ్యంలోనే గూడూరు మండలంలో వైసీపీని బలోపేతం చేసే దిశలోకొమ్మనేటూరు ఎంపిటిసి ఇండిపెండెంట్ అభ్యర్థి గా గెలుపొందిన గడ్డం వెంకటయ్య సుబ్బయ్య ను గురువారం  నెల్లూరు లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ కండువా వేసి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.


 అంతేకాకుండా 2020 సంవత్సరంలో చిల్లకూరు మండలంలోని కడివేడు, తోనుకుమాల గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఆనాడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆహ్వానించి  పరిషత్ ఎన్నికల్లో  కడివేడు, తోనుకుమాల ఎంపీటీసీ లను ఏకగ్రీవం చేయించడంలో కీలకపాత్ర పోషించారు,ఇలా చిన్న వయస్సులోనే రాజకీయాల్లో అడుగుపెట్టి వైఎస్సార్సీపీ బలోపేతం చేసేందుకు అయన చేస్తున్న కృషికి వైసీపీ నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.