తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్నిరోజులుగా జల వివాదాలు నడుస్తున్న విషయం విదితమే. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ భోజనం చేయగాలేనిది.. జల వివాదాలపై మాట్లాడటం చేతకాదా? అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కావాలనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు.

కేంద్రం సిద్ధం..

'ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా?. ప్రజలు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని గుర్తిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటాం. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా జితేందర్‌రెడ్డిని నియమించాం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలు అప్పగిస్తాం' అని కిషన్‌రెడ్డి తెలిపారు.