కిసాన్ నగర్, ముత్తుకూరు మండలంలోని పి.వి.కండ్రిగ గ్రామాల్లో.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు
నెల్లూరు
మున్సిపాలిటీ పరిధిలోని కిసాన్ నగర్, ముత్తుకూరు మండలంలోని పి.వి.కండ్రిగ గ్రామాల్లో.., బుధవారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొదట.., కిసాన్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, అధికారులను అడిగి పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దాలని, అత్యుత్తమ విద్యా భోదన అందించాలన్నారు. పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్.., వేగంగా మరుగుదొడ్లు పూర్తి చేయాలని, నాడు-నేడు పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్ సరఫరా విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పాఠశాలలో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని.., మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం ముత్తుకూరు మండలం పి.వి.కండ్రిగ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయులు, అధికారులు, అంగన్ వాడీ వర్కర్లతో సమీక్ష నిర్వహించారు. పి.వి.కండ్రిగ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు అంగన్ వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకూ గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ కి అధికారులు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది, మాస్కులు ధరించి ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని అరికట్టే చర్యలలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ .., నాడు-నేడు పనుల్లో రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. సెప్డెంబర్ లేదా అక్టోబర్ నాటికి పాఠశాలలు ప్రారంభమవుతాయని, అప్పటికి అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని.., విద్యార్థులకు పుస్తకాలు, షూసు, బ్యాగుతో పాటు మాస్కులు కూడా అందిస్తామన్నారు. ఇళ్లలోనే ఉన్న పిల్లలకు దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పించే కార్యక్రమంతో పాటు.., బ్రిడ్జ్ కోర్సులు కూడా నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులు కరోనా నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు విషయంలో ప్రజలను చైతన్య పర్చాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, మెరుగైన వసతులు కల్పించామని, కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన అందిస్తామన్నారు. ఉత్తమ విద్యా భోదన అందించే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలన్నారు. జిల్లాలో
కరోనా మరణాలు సంఖ్య తగ్గించగలిగామని, క్రిటికల్ కేసులను ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో 2,500 బెడ్స్, కోవిడ్ కేర్ సెంటర్లలో 3,500 బెడ్స్ ఉన్నాయని, బెడ్స్ కి ఎలాంటి కొరత లేదన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించకుండా, వ్యాధి లక్షణాలు తీవ్రమైన సమయంలో ఆస్పత్రిలో చేరిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందని..., అలాంటి వారికి మెరుగైన చికిత్స అందించినా కూడా మరణాన్ని నివారించలేకపోతున్నామన్నారు. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరం ఉన్నవారు.., కోవిడ్ టెస్ట్ చేసుకోకపోయినా కూడా ఆస్పత్రిలో చేరవచ్చన్నారు. ఏ మాత్రం కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా, చికిత్స తీసుకోవాలని, దీనివల్ల మరణాల్ని అడ్డుకోవచ్చన్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారు 35 మంది ప్లాస్మా డొనేట్ చేశారని.., వారి ప్లాస్మా ద్వారా 70 మంది ప్రాణాలు రక్షించగలిగామన్నారు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రాకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.ఏ. శ్రీ వి. బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.