ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్
****
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని, ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోయాయని ఘన నివాళులు అర్పించారు
14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాపరెడ్డి.  రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక వికాస్ హై స్కూల్లో ఈ రోజు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ఎంతోమంది కి సంజీవని వలె మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించింది అని, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పధకం ఎంతో మంది  విద్యార్థులకు ఉన్నత చదువులు చదువు కొనేందుకు అవకాశం కల్పించిందన్నారు.ఈ పధకం విప్లవాత్మకమైన మార్పును తీసుకు వచ్చిందన్నారు.ఎంతో మంది పేద పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర మంచి విద్యను అభ్యసించగలిగారంటే అందుకు కారణం వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన పధకాలు కారణమన్నారు. అలాగే108,104 వాహనాల ద్వారా అత్యవసర వైద్యాన్ని అందించే పథకంగా అందరికి ఉపయోగ పడే దిగా మారిందన్నారు.అలాగే పెన్షన్లు మొత్తాన్ని పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.తండ్రి చూపిన బాటలోనే ఆయన తనయుడు అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జనాకర్షక పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొంటున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి , ఓబులురెడ్డి ,  లక్ష్మి రెడ్డి, ప్రసాద్ రెడ్డి,సాకేథ్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, శివా రెడ్డి, ప్రసన్న రెడ్డి,సుబ్బారెడ్డి , శంకర్ రెడ్డి ,  నారాయణ , రవి కుమార్ , కిరణ్ కుమార్ , మీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.