కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం..కలువాయ లో ఆనం:::
కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం..కలువాయ లో ఆనం:::
👉 గడచిన 15 మాసాలుగా కరోనా.. కొంత కాలం ఎన్నికల నిబంధనలు..కొంత మంది అధికారుల అలక్ష్యం, అలసత్వం..కొన్ని ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు లో జాప్యం, ఆర్థిక వనరుల ఇబ్బందులు,,తదితర కారణాలతో అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో జాప్యం జరిగిందని..ఇక పై అన్ని సమస్యలను అధిగమించి అందరూ శ్రద్ధగా పని చేయాలని కలువాయ మండల పరిషద్ కార్యాలయం లో నిర్వహించిన సమీక్షలో అధికారులకు,స్థానిక ప్రజా ప్రతినిధులకు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు దిశా నిర్దేశం చేశారు.
👉 జూలై మొదటి వారంలో కనుపూరు పల్లి సచివాలయం, కుల్లూరు PHC భవనాలను ప్రారంభిస్తామన్నారు
👉 ప్రతీ 15 రోజులకు ఒకసారి ఇకపై సమగ్రంగా మండలంలో సమీక్షిద్దామన్నారు
👉 గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాల కోసం నూతన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు చేరువ కావాలన్న లక్ష్యం తో పని చేస్తున్న మన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి
ఆలోచనలకు విఘాతం కలగకుండా అధికారులు అందరూ కృషి చేయాలన్నారు..నేడు
కలువాయ మండల కేంద్రం లోని BVNR జడ్పీ హైస్కూల్ లో నాడు నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రివర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కోటి రూపాయల నిధులు వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను,అదనపు సౌకర్యాల పనులను మరియు సచివాలయ భవనాల పనులను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు..కలువాయ గ్రామ దేవత కలువాయమ్మ తల్లి అనుగ్రహం పొందిన అనంతరం...మండల పరిషద్ కార్యాలయం లో సచివాలయం వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు