*ప్రజల బాధలు పట్టవా* 

 *ఆర్టీసీ బస్సుల తరలింపుతో ప్రయాణికులకు అగచాట్లు* 

 *పేదల ఎలా పోతే నాకేంటి సిద్ధం సభలకు బస్సులు ఉంటే చాలు* 

 *యదేచ్ఛగా అధికార దుర్వినియోగం* 
  *బొల్లినేని వెంకట రామారావు* 
కలిగిరి మండలం పెద్ద కొండూరు పంచాయతీ పెద్దపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపురంలో జరుగు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు జన సమీకరణ కోసంగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నాన అగచాట్లు పడుతున్నారు. సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారడంతో ప్రభుత్వ తీరుపై ప్రజల మండిపడుతున్నారు. మాది పేదల ప్రభుత్వం అంటూ మాటలతో ఊదరగొట్టే జగన్.. అధికారం చేపట్టినప్పటి నుంచి వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో అధికార పార్టీ పెట్టే సభలకు మళ్లించి ప్రజలను అవస్థలు పాలు చేశారు. పేదల ఎలా పోతే నాకేంటి సిద్ధం సభలకు బస్సులు ఉంటే చాలు అనే విధంగా రాక్షసి పాలన సాగిస్తున్నారు. సీఎం సభ జనానికి నరకంగా మారడంతో అనేక చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటనలు కళ్లారా చూసాం. ఈరోజు రేపు రాష్ట్రంలో అనేక శుభకార్యాలు ఉండడంతో రవణార సౌకర్యం లేక ప్రజల పడుతున్న బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ఆయన వెంట  మండల టిడిపి నాయకులు గ్రామస్తులు ఉన్నారు.